విశాఖపట్నం: గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ (A), ఎం.వి.పి. క్యాంపస్‌లోని ఎలక్ట్రానిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఎంబెడెడ్ సిస్టమ్స్ (Embedded Systems) అంశంపై మూడు రోజుల వర్క్‌షాప్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు ఈ వర్క్‌షాప్ నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెకీ బోట్ సంస్థకు చెందిన శ్రీ దిలీప్ హాజరయ్యారు. కళాశాల డైరెక్టర్ (యూజీ కోర్సెస్) శ్రీ డి. గిరిధర్, ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి శ్రీ నటరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.ఎస్. బోస్ నిర్వాహకులకు, విద్యార్థులకు ఆశీస్సులు అందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ దిలీప్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ప్రాధాన్యత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వాటి వినియోగం, విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల గురించి వివరించారు. డైరెక్టర్ శ్రీ డి. గిరిధర్ మాట్లాడుతూ, విద్యార్థులు తరగతి గది బోధనతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకొని, ఆచరణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి శ్రీ కె.నటరాజ్ మాట్లాడుతూ, ఈ మూడు రోజుల వర్క్‌షాప్ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్షంగా నేర్చుకునేందుకు మంచి అవకాశమని తెలిపారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను డాక్టర్ ఎ. సుభాషిణి సాదరంగా ఆహ్వానించారు. ఎలక్ట్రానిక్స్ విభాగ అధ్యాపకులు స్వరూప రాణి, వి.ముత్యాల నాయిడు, డా.లావణ్య ఫిజిక్స్ విభాగాధిపతి, శ్రీ మతి శైలజ మేథ్స్ విభాగం,డా.అనిత హిందీ విభాగం తదితరులు కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందించడమే ఈ వర్క్‌షాప్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.



0 Comments