సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి


భారతదేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151 వ జయంతి కార్యక్రమాన్ని వివేకానంద సంస్థ వారు నిర్వహించారు, ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు తొలి ఉప ప్రధాని మరియు తొలి హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు, స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నారు. గుజరాత్ లో ఆయన జ్ఞాపకార్థం 182 మీటర్ల ఎత్తు అయినా “స్టాట్యూ ఆఫ్ యూనిటీ” విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఆయన చేసిన సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్  గా జరుపుకుంటారు, అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సత్తిబాబు మరియు మహిళా సభ్యులు ఉమాదేవి, కనకమాలక్ష్మి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments