విశాఖపట్న:ఈ రోజు అనగా తేది. 21.10.2026 గౌరవ ఎం.అభిషిక్త్ కిషోర్, జిల్లా కలెక్టర్, విశాఖపట్నం వారి అధ్యక్షతన డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి అధ్వర్యంలో కలెక్టర్ వారి సమావేశ మందిరంలో మాతృ మరణాల పై డిస్ట్రిక్ట్ మెటర్నిటీ డెత్ సర్వేలేన్స్ మరియు రెస్పాన్స్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వారు మాట్లాడుతూ జనవరి 2026 నుండి జూన్ 2026 వరకు జరిగిన 6 మాతృ మరణాలు, జనవరి లో న్యూ గాజువాక పట్టణ ఆరోగ్య కేంద్ర పరిదిలో 1 మాతృ మరణం, భవాని గార్డెన్స్ పట్టణ ఆరోగ్యకేంద్ర పరిదిలో 1 మాతృ మరణం, పి.ఎం.పాలెం పట్టణ ఆరోగ్య కేంద్ర పరిదిలో 1 మాతృ మరణం, మార్చి నెలలో గాజువాక ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిదిలో 1 మాతృ మరణం, జూన్ నెలలో బాలాజీనగర్ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిదిలో 1 మాతృ మరణం మరియు సొంట్యాం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిదిలో 1 మాతృ మరణం పై సమీక్ష నిర్వహించారు హైరిస్క్ గర్భిణీల డేటా తీసుకుని వాట్సాప్ గ్రూప్ లోనే కాకుండా కేసు హిస్టరీ మొత్తం తీసుకుని ప్రైవేటు హాస్పిటల్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారికి తెలియచేయాలి. ఈ మాతృమరణాలు సంబవించిన ప్రాంతాలలో గల ఏ.ఎన్.ఎం లందరికి ఇది ప్రధమ తప్పుగా భావించి రెండోసారి మాతృ మరణం సంభవిస్తే ఉద్యోగం నుండి తొలగించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారికీ ఆదేశించారు. అధిక రక్తపోటు గల కేసు లను గుర్తించి ముందుగా వారికీ డాక్టర్ యొక్క సేవలు అందించాలని వారికీ డయాగ్నోసిస్ అయ్యే ఖర్చులను రెడ్ క్రాస్ కేంద్రానికి గాని లేదా సి.ఎస్.ఆర్.నిధుల నుండి గాని అందించాలని మరియు గర్భిణీల విభాగంనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం లో ఏర్పాటు చేసి అది ప్రైవేటు హాస్పిటల్స్ వారికీ తెలియచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారికి ఆదేశించారు. కేసు లను ప్రైవేటు హాస్పిటల్స్ కన్నా కె.జి.హెచ్.కు రిఫర్ చేయాలని మెడికల్ అధికారులకు, ఏ.ఎన్.ఎం.లకు ఆదేశించారు. ఇది అంతయు ఏ గర్భిణీ మరణించకూడదని జిల్లా కలెక్టర్ వారు ప్రత్యేకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారికీ, సిబ్బందికి ఆదేశించారు. డా.పి.జగదీశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ మాతృమరణాలు ఇకముందు సంభవించకుండా చూసుకోవాల్సిన భాద్యత సంబందిత ఆరోగ్య కేంద్రం యొక్క మెడికల్ అధికారి పై ఆధారపడి ఉంటుందని మరియు సంబందిత ANM సమయానికి గర్భిణీ స్త్రీ కి అవసరమైన సేవలను గుర్తించి అందజేయాలని తెలియచేశారు. ఇకముందు మాతృమరణాలు జరిగితే చర్యలు తీసుకోబడతాయని, హై రిస్క్ గర్భిణీ లు ప్రసవానికి వచ్చినప్పుడు కాలయాపన చేయకుండా KGH కు గాని VGH కు గాని రిఫర్ చేయాలని ఆ విధంగా సురక్షిత కాన్పు జరిగేలా చూడాలని సూచించారు. ANM, ఆశా కార్యకర్తలు ఆడపిల్లలకు కౌమారదశ నుండి జరిగే మార్పులపై అవగాహన కల్పించాలని, గర్భిణీ స్త్రీలకు గర్బాధారణ నుండి అవగాహన కల్పించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి వారికి సమయానికి టీకాలు, పోషకాహారం మొ’’ ఆరోగ్య సేవలను అందేటట్లు చూడాలని తెలియచేశారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీలకు బర్త్ ప్లానింగ్ సక్రమంగా చేయాలని మరియు ఆయా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య స్థితి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశoలో డా.నరేంద్ర సింగ్, DCHS, APVVP, డా.రోణంకి రమేష్, DLATO, డా.లూసి, డి.ఐ.ఒ., డా.ఉషాప్రసాద్, సూపరింటెండెంట్, VGH, డా.శైలజ, గైనకాలజిస్ట్, HOD, KGH, డా.ఆర్.జనార్ధన్, జనరల్ మెడిసిన్, KGH, డా.గణేష్, అనస్తీసియా, కె.జి.హెచ్. డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ, శ్రీ బి.నాగేశ్వర రావు, డెమో, డా.ఎన్.వి.సమత, విమెన్ హెల్త్ ఆఫీసర్, డా.కె..అప్పారావు, ఎన్టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డా.వై.డి.కళ్యాణి, మెడికల్ ఆఫీసర్, మరియు ప్రాధమిక/పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం




0 Comments