విశాఖపట్నం: విశాఖ సందేశం వార్తా వాహిని: జీవీఎంసీ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ఏ రాజకీయ పార్టీ ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై విశాఖ బ్రాహ్మణ ఐక్యవేదిక సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ద్వారకా నగర్ లో
ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశంలో ఐక్యవేదిక సభ్యులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏ ప్రధాన రాజకీయ పార్టీ విశాఖ కార్పొరేషన్ కార్పొరేటర్ సీట్లు కేటాయించకపోవడంపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగేలా కార్యచరణ రూపొందించాలని నిర్ణయించారు.
సుమారు రెండు లక్షల పైగా ఓటర్లు కలిగి ఉన్నప్పటికీ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.జీవీఎంసీ ఎన్నికల్లో బ్రాహ్మణుల ఓటు బ్యాంకు సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ బ్రాహ్మణ సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు
0 Comments