వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యం: అల్లవరం వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాటి శ్రీరామ్....

         SRINIVAS SPL Correspondant 
అల్లవరం: విశాఖ సందేసం....మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి కుటుంబానికి వలంటీర్ల ద్వారా సంక్షేమాన్ని అందించారని అల్లవరం వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి పాటి శ్రీరామ్ అన్నారు. కోడూరుపాడు గుబ్బలవారిపాలెంలోని ఆయన నివాసంలో మంగళవారం విలేకర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ | అభ్యర్థినైనా నన్ను మండల ప్రజలు ఆదరించి విజయాన్ని అందించాలని కోరారు. మండలంలో దశాబ్దకాలంగా ముంపు కారణంగా ప్రతి యేటా వందలాది ఎకరాల్లో వరి పంట పాడై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతులు ఎదుర్కొంటున్న ముంపు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, గురుకులాల్లో మౌళిక సౌకర్యాల కల్పనకు పెద పీట వేస్తామన్నారు. తూర్పులంక, సామంతకుర్రు ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. 


శివారు ప్రాంతాలో తాగునీటి సమస్య ఉందని, ప్రజల అవసరాన్ని గుర్తించి ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. నవంబర్ 5 న జరగనున్న జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మేజారిటీతో గెలిపించాలని శ్రీరామ్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ తిక్కా ప్రసాదు, కుడుపూడి అప్పారావు, బొంతు సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments