జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం


విశాఖపట్నం :ఈ రోజు అనగా తేది. 24.10.2026న ఐ.సి.ఎం. ఆర్. చెన్నై రీసెర్స్ టీం విశాఖపట్నం ను సందర్శించి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి. జగదీశ్వర రావు వారిని, జిల్లా ఎపిడిమాలజిస్ట్ డా. ప్రదీప్ రాజా వారిని కలిసి ఈ సంవత్సరం 2026 వేసవి కాలంలో హీట్ స్ట్రోక్ కు సంబంధించి ముందస్తు ప్రణాళిక (ఏక్షన్ ప్లాన్) ఏ విదంగా వేసారో అడిగి తెలుసుకున్నారు. ఈ టీం లో డా. వైదేశ్ గోస్వామి, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-2, డా. విజ్జేశ్వరన్.కె, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-2, డా.ప్రియాంతి. ఎ, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్- 1, శ్రీ విజ్జేశ్ బాబు, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్- 3 ఉన్నారు. వీరు ఐ.సి.ఎం.ఆర్. ఢిల్లీ మరియు చెన్నై నుండి రీసెర్చ్ టీం గా జిల్లా కు విచ్చేసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారిని మరియు డిస్ట్రిక్ట్ సర్వేలెన్సు అదికారి వారిని కలిసి జిల్లాలో గల హీట్ కు సంబందించి 2026 క్యాలెండరు ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశం లో డా. జగదీశ్ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్, డా. శాంతి సౌందర్య, జిల్లా ఎపిడెమాలజిస్ట్ మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది, శ్రీ బి. నాగభూషణ రావు, అసిస్టెంట్ మలేరియా అధికారి వారు పాల్గొన్నారు.

             జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

                         విశాఖపట్నం

Post a Comment

0 Comments