విశాఖపట్నం :ఈరోజు అనగా తేది. 04.11.2026 న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు స్టేట్ రివ్యూ మిషన్ కమిటి ఈ మూడు జిల్లాల్లోని వివిధ రకాలైనటువంటి హెల్త్ ఇండికేటర్స్ నిమిత్తం ఇక్కడ విశాఖపట్నం జిల్లా ప్రోగ్రాం అధికారులని సమీక్ష చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా సత్కరించారు. వీరిలో శ్రీ డి.ప్రకాష్ రావు గారు స్టేట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి. డా.ఎల్.బి.ఎస్.హెచ్.దేవి, స్టేట్ ఇమ్మ్యునైజేషన్ అధికారి, మరియు ఎ.వాసుబాబు మొదలగు గారు ఎన్.హెచ్.ఎం.నిధులు ఏ విధంగా వినియోగిస్తున్నారనేది, ఎన్.సి.డి.ఇండికేటర్స్ మరియు ఆర్.బి.ఎస్.కె.ఇండికేటర్స్ ఇమ్మ్యునైజేషన్, సీజనల్ వ్యాధులు, ఆశా విధులు మరియు టీం క్షేత్ర పర్యటనలో భానోజి నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం, గాజువాక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మరియు అనకాపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రము మరియు ఏరియా ఆసుపత్రి లను సందర్శించి అన్ని విషయాలు తెలుసుకొనుటకు విచ్చేసినట్లు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ-ఎన్.హెచ్.ఎం, శ్రీ శశిభూషణ్, డి.పి.ఒ, శ్రీ బి.రమేష్ ఎన్.హెచ్.ఎం.-ఎ.ఒ తదితర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం




0 Comments