విశాఖపట్నం :నవంబర్ 23 తేదీన జరుగనున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని, విశాఖపట్నంలోని *ఎం.వి.పి. కాలనీలో ఉన్న ప్రేమ సదన్ మందిరంలో* నిర్వహించనున్న వేడుకలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసి వేడుకలను శోభాయమానం చేయవలసిందిగా మాజీ ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు గారిని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు – విశాఖపట్నం జిల్లా ప్రతినిధులు సాదరంగా ఆహ్వానించారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు, సిటీ సమితి కన్వీనర్ శ్రీ బి. సాయికుమార్‌తో పాటు శ్రీ సత్య సాయి సేవా సంస్థల పదాధికారులు శ్రీ శ్రీనివాస్, శ్రీ బి వి రమణ డాక్టర్ హరిబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మ శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావలసిందిగా ఆహ్వానించారు.
ఈ సాదర ఆహ్వానాన్ని స్వీకరించిన డాక్టర్ కంభంపాటి హరిబాబు గారు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన వేడుకలకు తప్పక హాజరవుతానని తన సంసిద్ధతను తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కంభంపాటి గారు హరిబాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా నిరుపేదలకు, అభాగ్యులకు, అవసరంలో ఉన్నవారికి అందిస్తున్న నిస్వార్థ సేవలు ఎంతో అభినందనీయమని అన్నారు. ఒడిశాలో కూడా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ, సేవ, త్యాగం అనే ఆదర్శాలను ప్రతిబింబించేలా సంస్థలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఆయన తన అభినందనలు తెలిపారు.

0 Comments