సింహాచలం, నవంబర్ 4: సింహాచల క్షేత్రంలో కొలువుదీరిన ఆ సిరులొలికించే దేవదేవుడు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని బుధవారం సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. ప్రత్యేక ఆహ్వానితులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు.. డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారితో పాటు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ సింహాచల వరాహ నరసింహస్వామి అత్యంత మహిమాన్వితుడని, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమని పేర్కొన్నారు. సింహగిరి క్షేత్రం ఆధ్యాత్మిక వైభవానికి, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
0 Comments