జీవీఎంసీ ప్రధాన పట్టణ ప్రణాళిక అధికారిగా జి.వి.జి.ఎస్.వి. ప్రసాద్ బాధ్యతల స్వీకరణ.



విశాఖపట్నం, నవంబర్ 4: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) ప్రధాన పట్టణ ప్రణాళిక అధికారిగా (చీఫ్ సిటీ ప్లానర్)  జి.వి.జి.ఎస్.వి. ప్రసాద్ బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు.

జి.వి.జి.ఎస్.వి. ప్రసాద్ గతంలో ఆంధ్రప్రదేశ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టరేట్‌లో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ, అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఏపీ రేరా)లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్.టి. నెం.1319, తేదీ 28.10.2026 ఉత్తర్వుల మేరకు ఆయనను జీవీఎంసీ ప్రధాన పట్టణ ప్రణాళిక అధికారిగా నియమించారు.

జీవీఎంసీలో గతంలో ప్రధాన పట్టణ ప్రణాళిక అధికారిగా పనిచేసిన ఎ. ప్రభాకరరావు 31.10.2026న పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీలో ఆయనను ప్రభుత్వం నియమించింది.

ఈ సందర్భంగా జీవీఎంసీ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది  జి.వి.జి.ఎస్.వి. ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

పౌర సంబంధాల అధికారి

 జీవీఎంసీ

Post a Comment

0 Comments