జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,


విశాఖపట్నం :ఈరోజు అనగా తేదీ 28.10.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు చేపలుప్పాడ పట్టణ ఆరోగ్య కేంద్రమును మరియు సైక్లోన్ పునరావాస కేంద్రంను సందర్శించి వైద్య ఆరోగ్య సిబ్బందిని సమీక్షించారు. పునరావాస కేంద్రములో ఉన్న ప్రజలను ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికీ 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ పునరావాస కేంద్రములో ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినట్లయితే ఉచిత రవాణా సదుపాయం 108 సేవలు కూడా అందుబాటులో కలదని తెలియచేసారు మరియు తేది. 27.10.2026 అర్ధరాత్రి 01:00 గంట వరకు కనితి, గాజువాక ఆరోగ్య కేద్రములను, మెడికల్ క్యాంపు లకు పర్యవేక్షించారు. ప్రజలు మరిగించిన నీటినే త్రాగవలెనని, ఆరోగ్యానికి సంబంధించి ఎవరూ కలత చెందవలదని భరోసా కల్పించారు. 

ఈ సందర్శనలో డా.కె.అప్పారావు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త, పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ బి.నాగభూషణం వారు మరియు ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.                 జిల్లా వైద్య ఆరోగ్య  శాఖాధికారి                                  విశాఖపట్నం

Post a Comment

0 Comments