ముక్కా శ్రావణి పేరుపై కాపుసేన హర్షం! - మేయర్ పదవి కేటాయింపుపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు. - విశాఖ మేయర్ గెలిపించి కూటమి నాయకులకు గిప్ట్ గా ఇస్తాం


విశాఖపట్నం, : జీవీఎంసీ మేయర్ పదవికి డాక్టర్ ముక్కా శ్రావణి పేరు తెరపైకి రావడంపై కాపుసేన రాష్ట్ర అధ్యక్షుడు బండారు నారాయణమూర్తి

(బి.ఎన్. మూర్తి) హర్షం వ్యక్తం చేశారు. మేయర్ పదవిని కాపు సామాజికవర్గానికి కేటాయించే అంశంపై సానుకూలంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయ నేపథ్యంతో పాటు విద్యార్హతలు, గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం కలిగిన డాక్టర్ ముక్కా శ్రావణి పేరు చర్చకు రావడం ప్రాధాన్యం సంతరించుకుందని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం కల్పించే దిశగా ఈ పరిణామాన్ని కాపుసేన అధ్యక్షుడు బండారు నారాయణమూర్తి

లంకా భాస్కర్, దాసరి రాధాకృష్ణ, 

తుమరాడ చంద్రమౌలేశ్వరరావు స్వాగతించారు. మా కాపుల ఐక్యమత్యంతో అందరినీ కలుపుకుపోయి రేయింబవళ్లు కష్టపడి

విశాఖ మేయర్ స్థానాన్నిగెలిపించి కూటమి నాయకులకు గిప్ట్ గా ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Post a Comment

0 Comments