గౌ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం , అదేవిధంగా విశాఖను ప్రపంచపటంలో ఉన్నతంగా నిలిపేందుకు అహర్నిశలు ఎంతో కృషి చేస్తున్నారు


విశాఖపట్నం -విశాఖ సందేశం వార్తా వాహిని-ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం , అదేవిధంగా విశాఖను ప్రపంచపటంలో ఉన్నతంగా నిలిపేందుకు అహర్నిశలు ఎంతో కృషి చేస్తున్నారు అన్నందుకు నిదర్శనం ఈ రోజు సుమారు 47.49 కోట్ల రూపాయల మేరకు VMRDA నిధులతో చేపడుతున్న శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవముల అని చైర్మన్ శ్రీ ఎంవి ప్రణవ్ గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు గౌ మున్సిపల్ శాఖామాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో VMRDA పరిధిలోని పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యుల సహకారంతో గౌ ముఖ్యమంత్రి వర్యులు VMRDA నిధులు సుమారు రూ 35.00  కోట్ల వ్యయంతో నగరవాసులకు వివిధ శాసనసభ నియోజకవర్గాల్లో  42 కొత్త ఉద్యానవనముల అభివృద్ధి, పెదగంట్యాడలో రూ 9.09 కోట్లతో క్రీడా ప్రాంగణం మరియు రూ 3.40 కోట్లతో విశాఖపట్నం పర్యాటక మణిహారం కైలాసగిరి పై అదనపు రహదారి నిర్మాణానికి  వంటి పనులకు వర్చువల్ గా  నేడు శంకుస్థాపన గావిస్తున్నారని, అదేవిధంగా VMRDA పరిధిలోని పలు నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి పనులను కూడా చేపట్టి పూర్తి చేయడం జరుగుతోందని ఆయన అన్నారు

Post a Comment

0 Comments