తూర్పు నియోజకవర్గం 22వవార్డులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్ధి గొలగాని మంగవేణి తరుపున వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నుంచి ఎంవీపీకాలనీ సెక్టారు-6, సెక్టారు-2ల్లో ఆయన తెదేపా అభ్యర్ధిని గొలగాని మంగవేణితో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. స్ధానిక సమస్యల పరిష్కారానికి కూటమి అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వహాయంలో విశాఖనగరంలో జరిగిన అభివృద్దిని వివరించారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాయంలో అభివృద్దితో పాటు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగిందన్నారు.

ప్రధానంగా అనునిత్యం ప్రజలతో మమేకమయ్యే గొలగాని మంగవేణితో పాటు మేయరు అభ్యర్ధిని ముక్కా శ్రావణికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా పలు అపార్టెమెంట్లకు వెళ్లి ఆయా అపార్టెమెంట్ వాసులను కలిసి కూటమి అభ్యర్ధులకు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పలు చర్చిల్లో ప్రార్ధనల్లో సైతం పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా స్ధానిక నాయకులు గొలగాని పోలారావు, మసేను, కారి రామారావు, నూకరాజులతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
0 Comments