విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 39వ వార్డులో దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ దామోదర్ యాదవ్ తో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని, మేయర్ అభ్యర్థి కుమారి ముక్కా శ్రావణి గారికి సైకిల్ గుర్తుపై, స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ దామోదర్ యాదవ్ కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.
గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, దక్షిణ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం నగర అభివృద్ధిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.39వ వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, స్థానిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రజల ఆశీస్సులు, మద్దతుతో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ అత్తిలి శంకర్రావు గారు, స్థానిక వార్డు అధ్యక్షురాలు, స్టేట్ డైరెక్టర్ శ్రీమతి రూప గారు, సీనియర్ నాయకులు చందు గారు, మహేష్ గారు, వార్డు ఎన్నికల ఇన్ఛార్జి డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ గారు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


0 Comments