జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 65వ, 54వ వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులు శ్రీ కురసాల కన్నబాబు గారు, శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె. రాజు గారు, మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు పాల్గొన్నారు.65వ వార్డులో భారీ ర్యాలీ65వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి షేక్ జాహిరున్నిషా గారి ఆధ్వర్యంలో పెద్దూరులో భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ముందుగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అక్కయ్యపాలెం, పెద్దూరు ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి సామాజికంగా, రాజకీయంగా అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. అదేవిధంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీలకు కీలక పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించారని తెలిపారు. ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారిని, 65వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి షేక్ జాహిరున్నిషా గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాయకులు ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి. బాలరాజు గారు, సతీష్ వర్మ, మహ్మద్ ఫారుక్కి,కిరణ్ రాజు,వార్డు అధ్యక్షులు పైడి రమణ, హబీబ్ అంబటి శైలేష్, హరిపట్నాయక్,షేక్ బాబ్జి,తదితరులు పాల్గొన్నారు. 54వ వార్డు బిలాల్ కాలనీలో ఇంటింటా ప్రచారంఅనంతరం విశాఖ ఉత్తర నియోజకవర్గం 54వ వార్డు బిలాల్ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె. రాజు గారు, మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కె.కె. రాజు గారు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకుని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారిని, 54వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ బాణాల సత్య శ్రీనివాస్ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ కె. అనిల్ కుమార్ రాజు, శ్రీ కిరణ్ రాజు, శ్రీ కె.వి. బాబా, శ్రీ బాణాల తరుణ్, 54వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.






0 Comments