విశాఖపట్నం: చిన్న వినాయక గుడి ఫంక్షన్ హాల్లో కాపుశెట్టి శంకర్, శంకర్ రావు, సుంకర నగేష్, శ్రీమతి శ్రీదేవి, శ్రీను, శివ, అన్నవరం తదితరుల ఆధ్వర్యంలో కాపు కమ్యూనిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ అభ్యర్థి డాక్టర్ శ్రావణి గారికి సైకిల్ గుర్తుపై, 37వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ శివప్రసాద్ రెడ్డి గారికి మద్దతు తెలియజేయాలని సమావేశంలో విజ్ఞప్తి చేశారు.
*రాజస్థానీ మార్వాడి సమాజం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*
RSM భవన్లో మార్వాడి సమాజ పెద్దలతో సమావేశం
విశాఖపట్నంలోని RSM భవన్లో రాజస్థానీ మార్వాడి సమాజం ఆధ్వర్యంలో నగరంలోని మార్వాడి సమాజ పెద్దలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గౌరవ ఎంపీ శ్రీ భరత్ గారితో పాటు ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు, మేయర్ అభ్యర్థి డాక్టర్ శ్రావణి గారు, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నగర అభివృద్ధి, ప్రజా సమస్యలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలకు సంబంధించిన అంశాలపై నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు తెలియజేయాలని కోరుతూ, మేయర్ అభ్యర్థి డాక్టర్ శ్రావణి గారికి సైకిల్ గుర్తుపై, స్థానిక కార్పొరేటర్ అభ్యర్థికి గాజు గ్లాసు, కమలం గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.




0 Comments