విశాఖపట్నం | తేదీ: 26-10-2026ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విశాఖ అభివృద్ధికి సహకరించండి: వైఎస్సార్సీపీ నాయకుల విజ్ఞప్తి*జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 62వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి పర్వీన్ గారి ఆధ్వర్యంలో సోమవారం 62వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత శివనగర్‌లోని దుర్గాలమ్మ, బంగారమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివనగర్, హర్ష నగర్, గ్రీన్ గార్డెన్స్, హుస్సేన్ నగర్, సాయి నగర్ ప్రాంతాల్లో భారీ ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె. రాజు గారు, జీవీఎంసీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారిని, 62వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి పర్వీన్ గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ర్యాలీ సందర్భంగా నాయకులు స్థానిక ప్రజలను కలిసి పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు భర్కట్ అలీ, రొంగాలి జగన్నాధం, మహమ్మద్ ఫరూక్, పీలా వెంకటలక్ష్మి, కె.వి. బాబా, జి.వి. రమణి, బి. రాధ, కిరణ్ రాజు, పీలా ఉమారాణితో పాటు 62వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



0 Comments