64వ వార్డులో కూటమి అభ్యర్థి ఈతలపాక సుజాతకు మద్దతుగా వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ప్రచారం - ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన ప్రణవ్ గోపాల్ - కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి


ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 64వ వార్డులో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కంచరపాలెం పరిధిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో భాగంగా తెదేపా అభ్యర్ధిని ఈతలపాక సుజాతకు మద్దతుగా 

వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. కంచరపాలెంలోని నలందనగర్‌,  సిద్ధార్థ నగర్, శ్రీనగర్, ఊర్వశి కూడలి తదితర ప్రాంతాల్లో ఈతలపాక సుజాతతో కలిసి వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ఎం.వి. ప్రణవ్ గోపాల్ ఇంటింటికీ వెళ్లి స్థానిక ఓటర్లను కలుసుకున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.

 స్ధానిక సమస్యల పరిష్కారానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వంతోనే  విశాఖ అభివృద్ది సాధ్యమని పేర్కొన్నారు. ప్రజలతో నిత్యం మమేకమవుతూ, స్థానిక సమస్యలపై అవగాహన కలిగిన తెదేపా అభ్యర్ధిని ఈతలపాక సుజాతకు, మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణికి ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రణవ్ గోపాల్ విజ్ఞప్తి చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి విజయాన్ని అందించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కంచరపాలెంలోని నూకాలమ్మ అమ్మవారిని ప్రణవ్ గోపాల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం జరిగిన  ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లగా, ప్రజలు అడుగడుగునా హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. కూటమి హాయంలో జరిగిన అభివృద్దికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి పార్టీలైన తెదేపా, జనసేన, భాజాపాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments