పూర్ణ మార్కెట్ ఇసుక కొండ పై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆశ్వీయుజ పౌర్ణమి సోమవారం నాడు వైభవంగా జరిగింది. శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆలయ ప్రధాన అర్చకులు పి నరసింహచార్యులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు.
ఉదయం 4:00 గంటల నుండి భక్తులందరూ ముందుగా ధ్వజస్తంభాన్ని మ్రొక్కి ఐదు ప్రదక్షణలు చేసినంతరం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. మూడు బ్యాచ్ లలో మొత్తం 126 దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతములు జరిగాయి. వ్రతంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రం, స్వామి వారి ఫోటో, నూక ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.
మధ్యాహ్నం 1000 మంది భక్తులకు అన్న సంతర్పణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోరుకొండ సూర్య ప్రసాద్ , బొట్టా సరోజిని , జెర్రిపోతుల ప్రసన్న , నల్లబిల్లి వెంకట లక్ష్మి , ఉప్పిలి అప్పలకొండ యాదవ్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసిన ఏర్పాట్లను ఉదయం నుండి పర్యవేక్షించారని ఆలయ ఈఓ టి రాజ గోపాల్ రెడ్డి తెలిపారు.
0 Comments