విశాఖలో కూటమి ప్రభుత్వ పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకుంటాం - వైఎస్ఆర్సీపీ మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి


విశాఖపట్నం విశాఖ నగరంలో కూటమి ప్రభుత్వ పర్యావరణ విధ్వంసాన్ని తీవ్రంగా అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నంలోని సెంట్రల్ పార్క్, వైఎస్సార్ పార్కులలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కుల్లో వాకింగ్‌కు వచ్చే ప్రజలను, వాకర్స్‌ను కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న భూ దోపిడీని అరికడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్‌సీపీ పాలన రావాలంటే.. రాబోయే జీవీఎంసీ (GVMC) ఎన్నికల్లో మేయర్ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేయాలని ప్రజలను కోరారు. వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా తనను, పార్టీ కార్పొరేటర్లను గెలిపిస్తే సెంట్రల్ పార్క్‌లో వాకర్స్‌కు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీనిచ్చారు. నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడానికి ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు. అలాగే ప్రతి పార్కులోనూ ఆధునిక వాకింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, పార్టీ నాయకులు పేర్ల విజయ్ చంద్ర, అల్లంపల్లి రాజబాబు, రవిరాజు, మువ్వల సురేష్‌తో పాటు పలువురు కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. వీరిలో 29వ వార్డు అభ్యర్థి పళ్ళా దుర్గారావు, 39వ వార్డు అభ్యర్థి దొడ్డి బాపు ఆనంద్, 43వ వార్డు అభ్యర్థి పెన్నిట్ల రేణుక రాజారెడ్డి తదితరులు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

Post a Comment

0 Comments