విశాఖ: తాను మేయర్ గా ఎన్నికైతే విశాఖ రూపు రేఖలు మారుస్తానని కాంగ్రెస్ పార్టీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థి దేవర నాగ సునంద దేవి యాదవ్ తెలిపారు.నగర కాంగ్రెస్ కార్యాలయంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హసిని వర్మ ఆధ్వర్యంలో బుధవారం
ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మేయర్ అభ్యర్థి దేవర నాగ సునంద దేవి యాదవ్ మాట్లాడుతూ తనను మేయర్ గా ఎన్నుకుంటే నగరంలో రోడ్ల నిర్మాణం, మెరుగైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, స్వచ్ఛ విశాఖే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు డబ్బు,ఇతర ప్రలోభాలకు లొంగకుండా హస్తం గుర్తుపై ఓటువేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ముఖ్యంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.అలాగే విశాఖలో ప్రజలకు నరకం చూపిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.జీవీఎంసీ పరిధిలో పార్కులు సుందరీకరిస్తానని, డ్రైనేజీలు మరమ్మత్తులు చేయించి మురుగు నీరు రోడ్లపైకి రాకుండా ఏర్పాట్లు చేయిస్తానని,వీధి దీపాలు నగరమంతా రాత్రులు నిత్యం వెలిగేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.ముఖ్యంగా యువత వ్యసనాలకు లోను కాకుండా ఆరోగ్యకరమైన
జీవనం గడిపేలా క్రీడా సదుపాయాలు మెరుగుపరుస్తామని సునంద హామీ ఇచ్చారు.జీవీఎంసీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆక్రమణలకు లోనుకాకుండా అడ్డుకుంటానని తెలిపారు.విశాఖ నగరంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆధునిక ప్రజా మరుగుదొడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.నగరంలో పర్యావరణ పరిరక్షణ,పచ్చదనం పెంపుకు కృషిచేస్తానని సునంద తెలిపారు.తనకు మేయర్ గా పోటీ చేసే అవకాశమిచ్చిన కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ,ప్రియంక గాంధీ,మల్లికార్జున ఖర్గే,ముఖ్యంగా పీసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి,తనకు పోటీ చేసేందుకు అన్నివిధాలా సహకరించిన హాసిని వర్మ,వేగి వెంకటేష్ తదితరులకు సునంద కృతజ్ఞతలు తెలిపారు.హాసిని వర్మ మాట్లాడుతూ విశాఖ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి అవకాశమిచ్చి కార్పొరేటర్ అభ్యర్థులను,మేయర్ అభ్యర్థిని హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీడియా సమావేశంలో సీనియర్ నాయకుడు వజ్జిపర్తి శ్రీనివాసరావు,విశాఖ దక్షిణ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేవీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

0 Comments