సుప్రీంకోర్టు ఆదేశాలను తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా గౌరవిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ గడువు పొడిగింపుపై తదుపరి నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘమేనని, ఎస్ఈసీ తీసుకునే నిర్ణయానికి టీడీపీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ పలు కేసులు వేస్తూ ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్‌పై తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేయడం సరికాదన్నారు. ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యమని పల్లా గారు పేర్కొన్నారు.
0 Comments