గిరిజన ప్రాంతంలో వివేకానంద సంస్థ సేవా కార్యక్రమాలు.


అరుకు, పాడేరు గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు, దింసా నృత్యదారులకు నిత్యావసరాలు, రగ్గులు, దోమతెరలు, స్వెటర్లు బట్టలను వివేకానంద సంస్థ సభ్యులు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

ప్రతి సంవత్సరం కూడా అరకు , పాడేరులో వివేకానంద సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. మరల ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించుటకు త్వరలో వస్తామని, 

ఈ సేవా కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సత్తిబాబు, అప్పలకొండ, భానోజీ రావు, నల్ల రాజు, D. నూకరాజు, నాయుడు, సూర్య చందర్రావు, మహిళా సభ్యులు, మరియు ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments