సౌత్ కోస్ట్ రైల్వే ముఖ్య ప్రధాన కార్మిక అధికారి (PCPO) ఎల్.వి.ఎస్.ఎస్. పాత్రుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సులభంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎపీఓ షేక్. షహాబాజ్ హనూర్ తదితర అధికారులు పాల్గొని పెన్షనర్లతో మమేకమయ్యారు.
ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయగా, మొత్తం 296 డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు విజయవంతంగా రూపొందించబడినట్లు అధికారులు తెలిపారు.
ఇదే వేదికలో రైల్వే వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని కూడా నిర్వహించారు. 300 మందికి పైగా పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు పొందారు.ఒకే చోట డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ మరియు వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో వృద్ధులకు ఎంతో సౌకర్యం కలిగిందని పాల్గొన్న పెన్షనర్లు అభినందించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంక్షేమానికి సౌత్ కోస్ట్ రైల్వే కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.
అలాగే, నవంబర్ 30 వరకు విశాఖపట్నంలోని హిందీ భవన్ , వెల్ఫేర్ సెక్షన్ లో ప్రతిరోజూ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సహాయ కేంద్రం కొనసాగుతుందని వెల్లడించారు.


0 Comments