భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రికి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆహ్వానం*

పుట్టపర్తి:నవంబర్ 06, 2026శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారు, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రాబోయే శతజయంతి వేడుకలకు హాజరుకావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా ఆహ్వానం అందజేశారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మరియు సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కూడా ఈ వేడుకలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు.


శ్రీ  సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్  హయ్యర్ లెర్నింగ్ (SSSIHL) 45వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న  గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు

నవంబర్ 6, 2026భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్.జె. రత్నాకర్ గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీ  సత్య సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్  హయ్యర్ లెర్నింగ్ (SSSIHL) 45వ వార్షిక స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.

ఈ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించిన గౌరవ గవర్నర్ గారు, ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తన అంగీకారాన్ని తెలియజేశారు. ప్రశాంతి నిలయాన్ని సందర్శించి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ 45వ వార్షిక స్నాతకోత్సవం నవంబర్ 22, 2026, ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రశాంతి నిలయంలో నిర్వహించనున్నారు.

Post a Comment

0 Comments