సీఐఐ సదస్సు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్. రావత్. * జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి పరిశీలన

 


విశాఖపట్నం, నవంబర్ 6: విశాఖపట్నంలో ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లను స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.


ఈ సందర్భంగా సదస్సు ప్రాంగణం లేఅవుట్ ప్లాన్, ప్రతిపాదిత డిజైన్లు, ప్రధాన ప్రవేశ ద్వారం, రిజిస్ట్రేషన్ బ్లాక్, ల్యాండ్‌స్కేపింగ్, ఫౌంటెన్లు, ఆకర్షణీయమైన శిల్పాలు, పార్కింగ్ ప్రాంతాలు, బారికేడింగ్, వాహనాల రాకపోకల మార్గాలు, సూచిక బోర్డులు, హోర్డింగులు, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర ఏర్పాట్లు గురించి అడిగి తెలుసుకున్నారు .సదస్సు ప్రాంగణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సుందరీకరణ పనుల వివరాలను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పెషల్ సీఎస్‌కు వివరించారు.


సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రహదారులు, ఫుట్‌పాత్‌లకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, ప్రధాన రహదారులు, సదస్సు పరిసర ప్రాంతాలను ల్యాండ్‌స్కేపింగ్, పచ్చదనం, పెయింటింగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. అన్ని ఏర్పాట్లను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిఎస్ ఆదేశించారు.


ఈ పరిశీలనలో ఏపీఈడీబీ సీఈఓ సాన్మోహన్, ఏపీఐసీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్, సీఐఐ నిర్వాహకులు మహేష్ తదితరులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ

Post a Comment

0 Comments