నర్సీపట్నం: నర్సీపట్నం నియోజకవర్గం లో వైసీపీ, సీపీఐ పార్టీలకు చెందిన నాయకులు టీడీపీలో చేరారు. నర్సీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి చింతకాయల రాజేష్ సమక్షంలో వైసీపీకి చెందిన సుమారు 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి.
జోగంపేట మాజీ సర్పంచ్ సుర్ల సీతారామమూర్తి, పార్టీ అధ్యక్షుడు చిటికెల తారక వేణుగోపాల్, అడిగర్ల అప్పలనాయుడు పార్టీ అధ్యక్షులు చిటికెల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా చింతకాయల రాజేష్ పార్టీ కండువాలు కప్పి వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



0 Comments