ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తోందని, జీవీఎంసీలో కూడా కూటమి అధికారంలోకి వస్తేనే నగరంతో పాటు స్థానిక వార్డుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. స్థానికంగా నెలకొన్న మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
76వ వార్డు సమగ్ర అభివృద్ధి కోసం:
* తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి కణితి సత్యనారాయణ (అప్పన్న) గారిని,
* జీవీఎంసీ కూటమి ఉమ్మడి మేయర్ అభ్యర్థిని డాక్టర్ ముక్కా శ్రావణి ని,
మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి వారిద్దరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు కూటమి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



0 Comments