తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్*



AP: అర్నబ్ తుఫాన్ నేపథ్యంలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిస్థితిని సమీక్షించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. తుఫానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని, ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బలమైన గాలుల నేపథ్యంలో హోర్డింగ్స్ను వెంటనే తొలగించాలని ఆదేశించారు.

Post a Comment

0 Comments