విశాఖపట్నం | తేదీ: 28-10-2026 :జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో 107, 108, 109, 110, 111, 112 వార్డులకు సంబంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) ఆత్మీయ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో
ఈ సమావేశాలు జరిగాయి.అనకాపల్లిలోని వివేకానంద ఫంక్షన్ హాల్లో 110, 111, 112 వార్డులకు సంబంధించిన సమావేశం నిర్వహించగా, జిల్లా పార్టీ కార్యాలయంలో 107, 108, 109 వార్డులకు సంబంధించిన సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు జీవీఎంసీ వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి, శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు పూర్తి మద్దతు అందించి, వారి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.
ప్రతి వార్డులో ప్రజలతో మమేకమై పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు: 107వ వార్డు: పన్నీరు వెంకటలక్ష్మి, 108వ వార్డు: బొడ్డేడ సరోజిని, 109వ వార్డు: కర్రీ లలిత, 110వ వార్డు: ఉగ్గిన జోష్ణ పద్మజ, 111వ వార్డు: నదియా, 112వ వార్డు: జాజుల ప్రసన్నలక్ష్మి ఆరు వార్డుల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులన్నీ ఐక్యంగా పనిచేయాలని, ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రజల మద్దతు లభించేలా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ
కార్యక్రమాల్లో అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ ఎంపీ డాక్టర్ వి. సత్యవతి, పార్టీ నాయకులు జానకిరామ్, శోభ హైమావతి, సతీష్ వర్మ, రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ బూత్ ఏజెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాలను విజయవంతం చేశారు.
0 Comments