విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 33వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ వీధుల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి గారికి సైకిల్ గుర్తుపై, స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ గరికన రమణి గారికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే, స్థానిక అభ్యర్థికి ప్రజల మద్దతు అందించాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసైనికులు, టీడీపీ నాయకులు, కూటమి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



0 Comments