విశాఖపట్నం, అక్టోబర్ 29:_ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాల నమోదు కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కూటమి నాయకులు నిర్ణయించారు. జీవీఎంసీ సహా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఆమోదయోగ్యమైన రీతిలో సీట్ల సర్దుబాటు జరిగిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జనసేన రూరల్ జిల్లా అధ్యక్షుడు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబులతో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం భేటీ అయ్యారు. కూటమి స్ఫూర్తిని కొనసాగించేలా క్షేత్ర స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులను కార్మోనుఖం చేయాలని నిర్ణయించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో పరుగు తీయిస్తున్న ప్రభుత్వానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని, ఎన్నికల ఫలితాల్లో అది ప్రతిబింబించనుందని పేర్కొన్నారు. విశాఖకు గూగుల్, ఐటీ, టూరిజం ప్రాజెక్టులు తరలి వస్తున్న నేపథ్యంలో నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్నారు. జాబితా ప్రకటించే వరకు మాత్రమే కింది స్థాయిలో నాయకులు, కార్యకర్తల మధ్య సీట్ల సర్దుబాటులో అసంతృప్తి ఉంటుందని, తుది ఎంపిక తర్వాత ఎన్నికల్లో కలసి పని చేయడంపై ఎలాంటి అపోహలకు తావుండదని వెల్లడించారు. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని 12 వార్డులు, ఆనందపురం, పద్మనాభం, భీమిలి రూరల్ మండలాల్లో 3 జెడ్పీటీసీ, 44 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడానికి కూటమి శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
నోట్: ఫోటోలు ఉన్నాయి.
(--###--)


0 Comments