విశాఖపట్నం, అక్టోబర్ 29: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రం 5.00 గంటలతో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ప్రచార గడువు ముగిసిన అనంతరం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. అభిషిక్త్ కిశోర్ సూచించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉన్నందున, గడువు ముగిసిన తర్వాత మైకులు, బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు తదితర ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు.

0 Comments