మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు



విశాఖపట్నం :తేదీ: 29-10-2026:మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి 

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె. రాజు గారి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. 

విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 46వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి నూనెల లావణ్య, 47వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మల్లా దేవి విశాలాక్షి, 48వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కర్రి రమణ రెడ్డి, 49వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మాధవి బొడ్డేటి ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల పరిధిలోని రైల్వే న్యూ కాలనీ, తాటి చెట్ల పాలెం, శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, 

కార్యకర్తలు మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారికి ఘనస్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి గారికి, స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులకు తమ మద్దతును ప్రకటిస్తూ సంఘీభావం తెలిపారు.

విశాఖపట్నంలోని మాధవధారలో ఉన్న గ్రాండ్ విలన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన క్రైస్తవ ఆత్మీయ సమావేశానికి వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె. రాజు గారి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమతి వరుదు కళ్యాణి గారు మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో తనకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని సమావేశానికి హాజరైన క్రైస్తవ సోదరులు, పాస్టర్లను కోరారు. 

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కీలక నాయకులతో పాటు జాన్ వెస్లీ, పాల విక్టర , జోహాన్ వెసలే, రాజశేఖర్, డేవిడ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక పాస్టర్లు, వివిధ క్రైస్తవ సంఘాల సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Post a Comment

0 Comments