నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మొల్లి అప్పారావు గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు


విశాఖపట్నం: తేదీ: 29-10-2026 మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు విశాఖ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు, 

తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మొల్లి అప్పారావు  ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మొల్లి హేమంత్ గారితో కలిసి పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, శ్రేణులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. 

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారికి, స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలిపారు.

మహా విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు విశాఖ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో 6వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పోతిన హనుమంతరావు గారు, 7వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పోతున్న జహ్నవి గారు, 8వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పిల్ల అనిత గారు పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ, పార్లమెంటు పరిశీలకులు కదిరి బాబు రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పాల్గొన్నారు. 

వీరితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారికి, స్థానిక కార్పొరేటర్ అభ్యర్థులకు తమ పూర్తి మద్దతును ప్రకటిస్తూ సంఘీభావం తెలిపారు.

Post a Comment

0 Comments