దక్షిణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ సమక్షంలో 40 వ వార్డు టీడీపీ మాజీ అధ్యక్షుడు, కాపు నేత బంటుపల్లి సూర్యనారాయణ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. 40వ వార్డులో బలమైన కాపు నేత గా ఉన్న బంటుపల్లి సూర్యనారాయణ వైసీపీలో చేరడం మరింత బలం చేకూరిందన్నారు. ఆయన టీడీపీ నుండి తనతో మంచి తత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ వార్డు వైసిపి అధ్యక్షుడు ముత్తా బత్తుల రమేష్, వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి బోరా విజయలక్ష్మి ఆధ్వర్యంలో బంటుపల్లి సూర్యనారాయణ వైసీపీలో చేరడం శుభ సూచికమన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన నాయకత్వం లక్షణాలు, నిస్వార్థ సేవలు ప్రతి కార్యకర్తలోనూ బలం చేకూర్తుందన్నారు. వైసిపి గెలుపుకు తన వంతు కృషి చేస్తానని, సూర్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు.
0 Comments