పరశురామరాజుకు మద్దతుగా సీఎం రమేష్ ప్రచారం బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు పోటీ చేస్తున్న 54వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు పాల్గొన్నారు పరశురామరాజుకు మద్దతుగా సీఎం రమేష్ .


విశాఖపట్నం 29-10-2026ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....దేశంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు మద్దతు ఇచ్చారని, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కుటమి అభ్యర్థులకు మద్దతిచ్చి త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడిచే విధంగా ప్రజల సహకరించాలని కోరారు.

 పంచ గ్రామాల సమస్య పై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుందని తెలియజేశారు.

 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 

 26,000 మంది పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు అందజేయడం జరిగిందని అన్నారు 

 కొండవాలు ప్రాంతాల్లో  ప్రజల సమస్యల అయినటువంటి ఇండ్ల పట్టాలు,రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, కమ్యూనిటీ హల్ వంటి సమస్యలకు పరిష్కారం పరశురామరాజు చూపిస్తారని అన్నారు.

 ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments