*టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పలు అంశాలు ప్రస్తావించారు*. *అధికారుల సమన్వయంతో తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం* *కూటమి ప్రభుత్వంలో విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోంది* *జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

విశాఖపట్నం :అధికారుల సమన్వయం, సహకారంతో తుఫాన్ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విశాఖపట్నం నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన పలు రాజకీయ అంశాలపై స్పందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వంలో విశాఖ అభివృద్ధికి పెద్దపీట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధి వేగవంతమైందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

*వైసీపీ పాలనలో రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైంది*: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, అనేక మంది పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని ఆరోపించారు.

*'సేవ్ వైజాగ్' అంటూ వైసీపీ మాట్లాడటం హాస్యాస్పదం*: విశాఖ అభివృద్ధిని గతంలో పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు 'సేవ్ వైజాగ్' అంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వారే ఇప్పుడు నగరాన్ని కాపాడతామంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

*వైసీపీ నాయకుల మాటలకు ప్రజలే సమాధానం చెబుతారు*: వైసీపీ నాయకులు చెబుతున్న నినాదాలకు, వారి గత పాలనకు పొంతన లేదని విమర్శించారు. నమ్మకం గురించి మాట్లాడే ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను, గతంలో చేసిన పనులను గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.

*ఎన్నికల తర్వాత వైసీపీకి రాజకీయంగా గుణపాఠం తప్పదు*: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ నాయకులకు ప్రజల తీర్పు ఏమిటో స్పష్టమవుతుందని అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని వ్యాఖ్యానించారు.

*వైసీపీ నాయకులే పోటీకి వెనుకంజ*: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పదవులు, అధికారాన్ని అనుభవించిన నాయకులు ఇప్పుడు ఎన్నికల్లో పోటీకి ముందుకు రాకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు.

*వరుదు కళ్యాణిని బలిపశువును చేస్తున్నారు*: వైసీపీలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ, వరుదు కళ్యాణిని రాజకీయంగా బలిపశువును చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు ముందుకు రాకపోవడం ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తోందని వ్యాఖ్యానించారు.

*విశాఖ ప్రజల తీర్పును వైసీపీ గుర్తించాలి*: గతంలోనే విశాఖ ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని, అయినప్పటికీ ఆ పార్టీ నాయకుల వైఖరిలో మార్పు రావడం లేదని విమర్శించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి వాస్తవాలను గుర్తించాలని సూచించారు.

*కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి*

జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు. విశాఖపట్నం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గౌరవ ఎంపీ శ్రీ భరత్ గారు, గౌరవ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుగారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ చిరంజీవి గారు , మేయర్ అభ్యర్థి డాక్టర్ ముక్కా శ్రావణి గారు,టిడిపి అధ్యక్షులు పట్టాభి గారు, పెద్దలౌశ్రీ కృష్ణ గారు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments