కొండవాలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్న శ్రీ కె.కె. రాజు


విశాఖపట్నం | తేదీ: 28-10-2026 కొండవాలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్న శ్రీ కె.కె. రాజు గారుఅర్నబ్ తుపాను ప్రభావంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 55వ వార్డు కస్తూరి నగర్‌లో కొండచరియలు విరిగిపడటంతో పాటు చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో కొండవాలు ప్రాంతాల్లో పర్యటించిన విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె. రాజు గారు స్థానిక ప్రజలను పరామర్శించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సేనాపతి అప్పారావు, సీనియర్ నాయకులు కె. చిన్న, బొట్ట రాజు, నీలాపు ఈశ్వరరావు, లావణ్య, అనిల్ శర్మ, దొరబాబు, అనిల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


కార్యక్రమం – 0247వ వార్డు సీనియర్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న శ్రీ కె.కె. రాజు గారు

ఈరోజు 47వ వార్డు పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 47వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మళ్ళ దేవి విశాలాక్షి గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె. రాజు గారు, 47వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మళ్ళ దేవి విశాలాక్షి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షుడు జక్కపూడి సత్యనారాయణ, సీనియర్ నాయకులు పద్మాశేఖర్, భాద శ్రీను, మహదాస్య గోపి, ప్రసాద్, ఖాదర్, గాలి బీమారెడ్డి, రమణమూర్తి, జగదేశ్వరరావు, లక్ష్మణరావు, నేతల కుమార్, నరసయ్య, చిన్నప్పరావు, స్వర్ణ, నాగమణి, సూర్యకుమారి, చిన్ని, లక్ష్మీ, సుజాత, ధనలక్ష్మీ, పావని, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


కార్యక్రమం – 0365వ వార్డు సీనియర్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న శ్రీ కె.కె. రాజు గారు

ఈరోజు ఎం.టి.సి. పాలెంలోని 65వ వార్డు పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 65వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి షేక్ జాహిరున్నిషా గారి ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె. రాజు గారు, 65వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి షేక్ జాహిరున్నిషా గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. ఈ సమావేశంలో వార్డు అధ్యక్షులు పైడి రమణ, హబీబ్, సీనియర్ నాయకులు షేక్ బాబ్జి, బొడ్డేటి గంగామహేష్, హరిపట్నాయక్, వై. సిద్ధార్థ్, సతీష్, ఆదిలక్ష్మీ, నిజామ్, భాష, దుర్గ, గణపతి, నాయుడు, సువర్ణ, అక్తరి తదితరులు పాల్గొన్నారు.


కార్యక్రమం – 04 .48వ వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీ కె.కె. రాజు గారు

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 48వ వార్డు అక్కయ్యపాలెం శ్రామికనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె. రాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 

మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి గారికి, 48వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కర్రీ రామారెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో తాడి జగన్నాధరెడ్డి, పారుపల్లి రవి, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి, మౌలిక రెడ్డి, దివాకర్ రెడ్డి, పిల్లా గోపి, ఆర్.ఆర్. విజయ్, వి. శ్రీనివాస్, దీపక్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమం – 05జోరువానలోనూ కొనసాగిన జీవీఎంసీ ఎన్నికల ప్రచారం57వ వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీ కె.కె. రాజు గారుజీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 57వ వార్డు కొండవాలు ప్రాంతాలైన బాపూజీ నగర్, నీలకంఠ నగర్, పాలనాటి కాలనీ, శ్రీనివాస నగర్‌లలో జోరువానను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కె.కె. రాజు గారు పాల్గొని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి గారికి, 

57వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కె.వి.ఎన్. శశికళ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో సీఈసీ సభ్యులు కోలా గురువులు, వార్డు అధ్యక్షుడు డోప్ప శ్రీను, రుత్తల రాంబాబు, గెలాక్సీ శ్రీను, విష్ణు, కండి పల్లి శ్రీను, అనిల్, పి. పద్మ, సుగును కుమార్, పి. అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments